కొండగట్టులో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

24-09-2026 | 09:44pm

మొదటి రోజు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు

మల్యాల, సెప్టెంబర్ 24,(విజయ క్రాంతి ):మల్యాల కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో(Kondagattu Sri Anjaneya Swamy Devasthanam) పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల మొదటి రోజున యాగశాలలో  ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉదయం యాగశాల ప్రవేశం, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ  మూలమంత్ర హవనాలు నిర్వహించి, స్వామివారికి సమర్పించనున్న పవిత్రలకు జలాధివాసం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు.

తదుపరి పూర్ణాహుతి, అవధారణలు, మంత్రపుష్పం, తీర్థగోష్ఠి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవముగా నిర్వహించనైనది.పవిత్రోత్సవాల సందర్భంగా స్వామివారి అనుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు