గాంధీజీ ఆశయాలే స్ఫూర్తి

02-10-2026 | 07:32pm

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

రాజన్న సిరిసిల్ల 2 అక్టోబర్  (విజయక్రాంతి): మహాత్మా గాంధీ(Mahatma Gandhi ) జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress Leaders) ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం మహాత్మా గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన అహింస, సత్యం, శాంతి, స్వచ్ఛత సందేశాలను నాయకులు స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగంపల్లి గంగరాజు, కూరపాటి శ్రీశైలం, బొద్దుల శ్రీనివాస్, ఎస్సీ సెల్ నాయకుడు ఆకునూరి బాలరాజు, మహిళా నాయకురాలు అరుణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రియాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప, మాజీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకుడు గడ్డం నరసయ్య, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు రఫీక్, ఎస్సీ పట్టణ అధ్యక్షుడు నక్క నర్సయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు