ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు

24-09-2026 | 04:23pm

తహశీల్దార్‌ ప్రసాద్‌

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ కేఆర్‌కేవీ ప్రసాద్‌(Tahsildar K.R.K.V. Prasad) గురువారం సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలు చేయొద్దని కోరారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, తీగలు, బలహీన నిర్మాణాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు