నిజామాబాద్ జర్నలిస్టుల పిల్లలకు 75 శాతం రాయితీ!
23-09-2026 | 10:29pm
బోధన్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 75 శాతం ఫీజు మినహాయింపు కల్పిస్తూ నిజామాబాద్ డీఈఓ పి.అశోక్(DEO P. Ashok) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రిడిటేషన్ కలిగిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పిల్లలకు ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ఉత్తర్వులను అన్ని ప్రైవేట్ పాఠశాలలు అమలు చేయాలని ఆదేశించారు.