పత్తి పంట కు తెగుళ్లు. రైతులు దృష్టి సారించండి.
24-09-2026 | 03:00pm
బోథ్. సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి) ప్రస్తుతం పత్తి పంటకు (Cotton crop)వివిధ రకాల తెగులు ఆశిస్తున్నాయని పంట సాగు చేసే రైతులు దృష్టి సారించాలని ఏఈఓ వాజిద్(AEO Wajid) సూచించారు. గురువారం మండలంలోని కౌట(బి )గ్రామంలో పంటలకు ఆశిస్తున్న తెగులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పంటను రసం పీల్చే పురుగులతో పాటు పిండి నల్లి ఆశించుతుందన్నారు.
అయితే రైతులు సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. లేకుంటే పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఎకరానికి 60 గ్రాముల ప్రిపోనిల్, లేదా లోని కామెడీ, ఎకరానికి 1 60 గ్రాములు, పిచికారి చేయాలన్నారు. వ్యాధుల నివారణకు రైతులు నిర్లక్ష్యం చేయకుండా వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.