బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల నిర్వహణ

30-09-2026 | 04:16pm

ముకరంపుర, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి) భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా (Bharatiya Janata Party OBC Morcha)ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.బుధవారం రోజున జమ్మికుంట పట్టణంలో శంకర్ నందన గార్డెన్ లో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అదేవిధంగా, స్థానిక శతరంజి చేనేత కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో పర్యటించి వారితో  ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు .

ఆయా కార్యక్రమాలకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్,  కరీంనగర్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి లు హాజరై , దిశా నిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ కుల  వృత్తులవారి అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన 'పీఎం విశ్వకర్మ' పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం, ఆధునిక శిక్షణ , రాయితీ రుణాల వివరాలను లబ్ధిదారులకు వివరించారు.

అనంతరం జమ్మికుంటలో ప్రసిద్ధి చెందిన శతరంజి చేనేత కార్మికుల పని ప్రదేశాలను సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేతన్నలు ఎదుర్కొంటున్న ముడి సరుకు కొరత, గిట్టుబాటు ధరల సమస్య మరియు జీవన ప్రమాణాల మెరుగుదలపై సుదీర్ఘంగా చర్చించారు. కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. అనంతరం కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్  సూచన మేరకు, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో  వీరబ్రహ్మేం

ద్రస్వామి వృద్ధాశ్రమం

లోపండ్ల పంపిణీ కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ,  రాష్ట్ర కార్యదర్శి ఓబిసి మోర్చా రాజు అడిచెర్ల  పాల్గొని   వృద్ధ  ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. 

మరిన్ని వార్తలు