ఘనంగా పోచమ్మ ఆలయంలో శాంతి హోమం
నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలోని పోచమ్మ దేవాలయంలో(Pochamma Temple) అమ్మవారి విగ్రహ పునః ప్రతిస్టాపన మహోత్సవ వేడుకల్లో బాగంగా శని వారం శాంతి హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు, కార్పొరేటర్ బండారి సుధాకర్, ఆలయ కమిటి ఆధ్యక్షుడు అర్కాల శ్రీనివాస్ ఆద్వర్యంలో శాంతి హోమం, ఆమ్మవారి రుద్రాభిషేఖాలు, అర్చనలు వేద పండితులు బుడి అణుదీప్ శర్మ, సుబ్బ అభేషేక్ శర్మలు నిర్వహించారు.
ఆలయంలో పోచమ్మ తల్లికి గణపతి పూజ, స్వస్తీ పుణ్యహావచనం, కళశాల పూజ, పూర్ణాహుతి, నవగ్రహ పూజలు చేశారు. అనంతరం లోక కళ్యాణార్ధం శాంతి హోమం నిర్వహించారు. శ్రీరాంపూర్ కాలనీ, వాటర్ ట్యాంక్ ఏరియాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పలు రకాల ప్రసాదాలు సమర్పించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కర్యక్రమంలో ఆలయ కమిటి ప్రదాన కార్యదర్శి రాసమల్ల దేవేందర్, ఉపాధ్యక్షుడు గడ్డల మధుకర్, ఆలయ కమిటి సబ్యులు బోడ రాజేశష్, అశోక్, గుమ్మడి తిరుపతి, జవాడి సాంబయ్య, మండ సురేష్, వీరయ్య, మొగిళి తిరుపతి, సామ రఘుపతి, పోగుల భీమయ్య, పాళగాని సురేష్, అల్లోజు రమేష్, కుమదారపు సురేష్, పోతునూరి శివప్రసాద్, మహేందర్, రణదీప్, లక్కెపరం రవి, రంగన్న పాల్గొన్నారు.