సుప్రీం ఫైర్.. మళ్లీ భగీరథ్‌ చర్చ!

05-10-2026 | 01:57pm

మహిళలపై అత్యాచారాలకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో మరో చర్చ (Discussion) మొదలైంది. లైంగిక నేరాలకు పాల్పడే వారికి చట్టం అంటే భయం పుట్టేలా కఠిన చర్యలు (Strict Action) ఉండాలన్న కోర్టు వ్యాఖ్యలను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు (POCSO Case) అంశం మరోసారి చర్చకు వచ్చింది. భగీరథ్‌పై మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన ఆరోపణలతో 2026 మేలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం ఆయనకు బెయిల్ కూడా మంజూరైంది. సుప్రీంకోర్టు చెబుతున్న కఠిన వైఖరి లైంగిక నేరాల ఆరోపణలు (Allegations) ఎదుర్కొంటున్న కేసుల విషయంలోనూ కనిపించాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు