ప్రభుత్వ పాఠశాల లో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మేలుకొలుపు
చేగుంట సెప్టెంబర్ 30 విజయక్రాంతి :చేగుంట మండలం, ఇబ్రహీంపూర్ ప్రభుత్వ పాఠశాలలో మెదక్ జిల్లా పోలీస్ శాఖ(Medak District Police Department) ఆధ్వర్యంలో మేలుకొలుపు కళాజాత బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, చైల్డ్ అబ్యూస్, బాల్యవివాహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, 18 ఏళ్లలోపు వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్సై 2 బిక్య నాయక్ ప్రధానోపాధ్యాయులు.ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్ వార్డు సభ్యులు మఠం నాగరాజ్ నీల నర్సింలు ఎగ్గడి నవీన్ చాకలి నవీన్,ఉపాధ్యాయ బృందం వెంకటేష్, పరంధామయ్య, మహేందర్,బాల్ నర్స్,నరేష్,జ్యోతి, గీత, ప్రియాంక, విద్యార్థులు పాల్గొన్నారు.