వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పోలీసుల పర్యవేక్షణ

18-09-2026 | 10:53pm

కోనరావుపేట సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): వినాయక నిమజ్జన(Vinayaka immersion) కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ ఎస్ఐ రామ్మోహన్ నిజామాబాద్, కోనరావుపేట ప్రాంతాల్లో నిమజ్జన ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా పూర్తయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు