6 September, 2026 | 8:31 AM

అమ్మకానికి ‘పాలిటెక్నిక్’ భూములు?

06-09-2026 | 05:30am
  1. అదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమా!
  2. జీవో 97 రద్దు చేయాల్సిందే
  3. అప్పటిదాకా విద్యార్థుల వెంటే
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

వేములవాడ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : పాలిటెక్నిక్ కళాశాలల(Polytechnic College) విలువైన భూములు(Lands), ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కన్నేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(K.T. Rama Rao) ఆరోపించా రు. పాలిటెక్నిక్ కళాశాలలను లేబర్ డిపార్ట్‌మెంట్(Labour Department) పరిధిలోకి తెచ్చేందుకు జారీ చేసిన జీ వో 97 వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అసెంబ్లీ వేదిక(Assembly Venue)గా ఎండగడతామని స్పష్టం చేశారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 20 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాల(Sircilla Polytechnic College) విద్యార్థుల(students)ను శనివారం కేటీఆర్ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు(students) ఆందోళన చేస్తే కేసు లు పెడతామని ప్రభుత్వం భయపెట్టే ప్రయ త్నం చేస్తోందని, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని సూచించారు. మాసబ్‌ట్యాంక్‌తో పాటు సిరిసిల్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో విలువైన భూముల్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ వ్యవస్థను బలహీనపరిచి, ఆస్తులను ఇతర అవసరాలకు వినియోగించుకునే ప్రయత్నాలను అడ్డుకుంటా మని తెలిపారు. 

అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా జీవో 97 అంశాన్ని బలం గా ప్రస్తావిస్తారని వెల్లడించారు. కేసీఆర్ ప్రభు త్వం పదేళ్ల పాలనలో విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంపై దృష్టి పెట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కేటీఆర్ విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెం ట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. జీవో 97ను రద్దు చేసి, ఎస్‌బీటీఈటీని కొనసాగించే వరకు విద్యార్థుల వెంట బీఆర్‌ఎస్ ఉం టుందని కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గవద్దని, అసెంబ్లీలో పోరాటం కొనసాగిస్తామన్నారు.

ఎలక్ట్రానిక్ జాకార్డ్ మగ్గం ఆవిష్కరణ

సిరిసిల్ల(విజయక్రాంతి): చేనేతలో ఆధునిక సాంకేతికతను జోడించి కొత్త తరహా హ్యాండ్లూ మ్ మగ్గాన్ని రూపొందించిన నేతన్న నల్లా విజయ్‌ను కేటీఆర్ అభినందించారు. విజయ్ ఆ హ్వానం మేరకు శనివారం విజయ్ ఇంటికి వెళ్లి న కేటీఆర్.. ఎలక్ట్రానిక్ జాకార్డ్ సాంకేతికతతో రూపొందించిన మగ్గాన్ని ఆవిష్కరించారు. దానిపై నేసిన ‘వెండి వెన్నెల’ చీరను కూడా ఆవిష్కరించారు.

నల్లా పరంధాములు వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయ్ వినూత్న ప్రయో గాలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లను పవర్లూమ్ పరిశ్రమకే పరిమితం చేయ కుండా ఆధునిక హ్యాండ్లూమ్ చేనేతకు కేంద్రం గా తీర్చిదిద్దాలన్న విజయ్ ప్రయత్నాలను ప్ర శంసించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయ్ కోసం సిరిసిల్ల లో ప్రత్యేక కర్మాగారం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు