పిఆర్టియు మండల శాఖ అధ్యక్షులుగా తిరుపతి రెడ్డి, కార్యదర్శి గా రాజశేఖర్
చేగుంట అక్టోబర్ 2, (విజయక్రాంతి): చేగుంట మండల ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయు మండల అధ్యక్షులుగా పోతిరెడ్డి తిరుపతి రెడ్డి,ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ని గజాగట్ల నాగరాజు అధ్యక్షతన 2026-2028 కి గాను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు తిరుపతి, రాజశేఖర్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ప్రాథమిక సభ్యునికి, ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తూ సంఘ అభివృద్ధికి అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు తాళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బాని శ్రీనివాస్, మండల రాష్ట్ర అసోసియేటె అధ్యక్షులు వెంకట్ రాం రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు బి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఎన్ శంకర్, జిల్లా కార్యదర్శి కరుణ సంతోషి వివిధ మండలాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.