అక్రమ అరెస్టులు పోరాటాలను ఆపలేవు
చలో కేటీపీపీ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): అక్రమ అరెస్టులు ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఆపలేవని బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు కటకం జనార్దన్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగముగా గురువారం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(Chelpur Kakatiya Thermal Power Project) కేటీపీపీ సందర్శనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చలో కేటీపీపీకి పిలుపునివ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత స్వంత పూచికత్తుపై వదిలేశారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి పట్టణ మాజీ అధ్యక్షులు కటకం జనార్దన్, గండ్ర యువసేన నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా యూత్ నాయకులు కరాటే శ్రీనివాస్, మాడ హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు కట్ల పూర్ణచందర్, మోతె రాజు, మహిళా విభాగం నాయకురాలు మాదాసు తిరుపతమ్మ, సోషల్ మీడియా ఇంచార్జి పూసల యుగేంద్రచారి, యూత్ నాయకులు ఆకుదారి మనోహర్ తదితరులు ఉన్నారు.