ప్రీతి ముండేను సన్మానించిన ఎమ్మెల్యే
మిస్ ఎర్త్ వాటర్ ఆఫ్ ఇండియా–2026
వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, అక్టోబర్ 03( విజయక్రాంతి ): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే(Priti Munde) మిస్ ఎర్త్ వాటర్ ఆఫ్ ఇండియా–2026గా(Miss Earth Water India) గుర్తింపు పొందిన సందర్భంగా విద్యాభ్యాసం చేసిన ఉట్నూర్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల యాజమాన్యం(Little Flower School Management) ఆమెకు శనివారం సాయంకాలం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(Vedma Bojju Patel) పాల్గొని ప్రీతి ముండేను సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిస్ ఎర్త్ వాటర్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించడం ద్వారా ప్రీతి ముండే మన ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఆమె సాధించిన విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని తమ ప్రతిభను వివిధ రంగాల్లో చాటాలని, లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రీతి ముండేకు మరిన్ని ఉన్నత అవకాశాలు లభించి భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఎమ్మెల్యే అభిలషించారు. ఆయనతోపాటు సర్పంచ్ అనిత శ్రీనివాస్, లిటిల్ స్టార్ పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.