ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలి
18-09-2026 | 10:08pm
న్యాయసేవాధికారసంస్థ జిల్లా కార్యదర్శి సౌజన్య
సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలని న్యాయసేవాధికారసంస్థ (Judicial Service Authority)జిల్లా కార్యదర్శి కె. సౌజన్య సూచించారు. న్యాయసేవాధికారసంస్థ జిల్లా చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.సుదర్శన్ ఆదేశానుసారం శుక్రవారం సిద్దిపేట జిల్లా జైలును జడ్జి సౌజన్య సందర్శించారు. ఖైదీల తో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. జైల్లో వంట గది, స్టోర్ రూమ్, టాయిలెట్స్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఖైదీలందరికి అడ్వకేట్స్ ఉండాలన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతి వారం జైలును సందర్శిస్తారని, అడ్వకేట్స్ లేనివారికి న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు.