ప్రక్షాళన జరిగేనా..!
- -ప్రైవేటుకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వ వైద్యులు..?
- -సర్కారు దవఖానాలో సమస్యల తిష్ట..
- -పనిచేయని లిఫ్టు... ఇబ్బందుల్లోహుద్రోగులు..
- -నిత్యం 1200 పైన ఓపి వైద్య సేవల్లో రోగులు...
- -జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిగిన మారని తీరు..
- -ఆగమ్య గోచరంగా జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వైద్య సేవల తీరు...
- -సర్కారీ కొలువుల్లో కొలువుదీరుతూ.. ప్రైవేటు వైద్యశాలకు మొగ్గు చూపుతున్న కొంతమంది ప్రభుత్వ వైద్యులు.?.
- -ఇద్దరు మంత్రులు ఒక డిప్యూటీ సీఎం ఉన్న ఇలాఖాలోనే ఈ తతంగం..?
ఖమ్మం హెల్త్ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District) ప్రభుత్వ దవాఖానాలో ప్రక్షాళన జరిగేనా....? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.. సర్కారు సేవల్లో కొలువుదీరిన కొంతమంది ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు వైద్యశాల వ్యాపారాలకి ఎక్కువ మొగ్గుచూపుతు సర్కారు దవఖానాలో తక్కువ సమయాన్ని వెచ్చించి కాస్త పేషెంట్లు తగ్గుముఖం పట్టిందని అనిపిస్తే సందర్భం కనిపిస్తే వెంటనే పలాయనం చిత్తగిస్తున్నారు కొంతమంది ప్రభుత్వ వైద్యులు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు వైద్యశాలలు నిర్వహణ ఉండకూడదని జీవోలు చెబుతున్నప్పటికీ అత్యున్నత పెద్ద పోస్టులో ఉంటూ ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులుగా.. మరి కొంతమంది ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న జాబితా ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం గా కనిపిస్తున్నప్పటికీ... ప్రజా పాలన ప్రభుత్వం వారికి అండగా ఉందని సాకు.. సాకుగా కాకుండా ప్రస్ఫుటంగా వారి మాటల్లోనే ఆ నోట ఈ నోట వినిపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
ఖమ్మం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఒక డిప్యూటీ సీఎం ఉన్న ఇలాకాలోనే ఇంతటి నిర్లక్ష్య ధోరణి, ప్రైవేటు వైద్యశాలల దోపిడి తీవ్రంగా జరుగుతుందని వాస్తవాలు వాస్తవ రూపంలో దాపురించినప్పటికీ వాటిని కప్పిపుచ్చుకుంటూ కొంతమంది వైద్యులు ఒక వైద్యాధికారి తమ వైద్యశాలను మూడు మూడు ఇన్ పేషెంట్ ఆరు సర్జరీ ల వలె వారి వ్యాపారాలను చక్కదిద్దుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి..