ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియలో వేగం పెంచాలి

08-09-2026 | 01:35am

నిర్మల్,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ (Special Intensive Revision) నోటీసుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి(State Chief Electoral Officer Sudarshan Reddy) అధికారులను ఆదేశించారు. సిఈఓ సుదర్శన్ రెడ్డి, సోమవారం సాయంత్రం ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఈఓ జిల్లాల వారీగా పూర్తి చేసిన నోటీసుల జారీ, ఇంకా పెండింగ్ ఉన్న నోటీసులు, హియరింగ్ నిర్వహణ వివరాలు కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియ మొత్తాన్ని గడువులోగా పూర్తి చేయాలన్నారు.

కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్ఐఆర్ నోటీసులు, హియరింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులకు వివరించారు. ప్రక్రియను వేగవంతంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. వివిధ రకముల ఫారముల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని వివరించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు