పీఆర్టియు సభ్యత్వ నమోదు
హాజరైన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు
ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రోగ్రెసివ్ రికగ్నయిస్డ్ టీచరర్స్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాస్ రావు హాజరయ్యారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సభ్యత్వం(Teacher Membership) కోరుతూ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన (టీజీఈ జేఏసీ) తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(Telangana Employees Joint Action Committee) రాష్ట్రస్థాయి మహా ధర్నా కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ... పెండింగ్ లో ఉన్న 6 డిఏలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలన్నారు. 2వ పేరివిజన్ కమీషన్ నివేదికను తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్ తో నూతన పీఆర్సీ అమలు చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాలకిషన్, ప్రధాన కార్యదర్శి శివశంకర్ రాష్ట్ర కార్యదర్శి సత్తయ్య స్వామి,శంకర్ బాబు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
