మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి
- లైఫ్ సేవర్స్ ఫౌండర్ శివ నేత
ఎల్బీనగర్: ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణాన్ని కాపాడాలని లైఫ్ సేవర్స్ ఫౌండర్ శివ నేత పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులనుప్రోత్సహించాలనే ఉద్దేశంతో లైఫ్ సేవర్స్ ఫౌండర్ శివ నేత(Life Savers Founder Shiva Netha) ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై ఎల్బీనగర్ లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో సోమవారం కాలేజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లైఫ్ సేవర్స్ ఫౌండర్ శివ నేత మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి, పర్యావరణహితమైన పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ లా కాలేజీ(Mahatma Gandhi Law College) చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లైఫ్ సేవర్స్ ఫౌండర్ శివ నేత, శంకరాచారి, సుధీర్, రవితేజ, స్పర్శ, అనూష, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
