ఇంట్లోకి కొండచిలువ.. స్నేక్ స్నాచర్ చాకచక్యంగా పట్టివేత

18-09-2026 | 02:44pm

కాగజ్‌నగర్(విజయ క్రాంతి): పట్టణంలోని అగ్రసేన్ భవన్ (Agrasen Bhavan)సమీపంలోని ఓ ఇంటి మొదటి అంతస్తులోకి కొండచిలువ ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ రమేష్ (Snake Snatcher Ramesh)అక్కడికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు