గాంధీ బాటలో నడుద్దాం..

02-10-2026 | 07:22pm

రామాయంపేట, అక్టోబర్ 2 (విజయ క్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) చూపిన సత్యం, అహింస మార్గమే సమాజానికి స్ఫూర్తిదాయకమని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సత్యం–అహింస సిద్ధాంతాలను జీవితంలో పాటించాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గం నేటి తరానికి కూడా ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు