ఎమ్మెల్యే సామెల్ మర్యాదపూర్వకంగా కలిసిన సర్వోత్తమ్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపై ఇరువురి చర్చ.
తుంగతుర్తి (విజయక్రాంతి) : తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్(Tungaturthi MLA Mandula Samel) మర్యాదపూర్వకంగా కలిసిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ(Graduate MLC) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(Ramreddy Sarvotham Reddy) పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార నిర్వహణ, గ్రాడ్యుయేట్ ఓటర్లను సమన్వయం చేసుకోవడం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, పిసిసి సోషల్ మీడియా కార్యదర్శి రామడుగు నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.