ఉనికి కోసమే రేగా పర్యటన
మండల అధ్యక్షులు ఊకే బుచ్చయ్య
గుండాల, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊకే బుచ్చయ్య ఒక ప్రకటనలో మాట్లాడుతూ...తన ఉనికిని కాపాడుకోవడం కోసమే మండల పర్యటనలు చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మండలంలో 483 ఇందిరమ్మ ఇల్లులు ఇప్పించామని, రైతులకు రూ. 14,92,85,033( పద్నాలుగు కోట్ల తొంబై రెండు లక్షల ఏనబై అయిదు వేల ముపై మూడు)
రుణమాఫీ చేసామని, రైతుల పంట పొలాలకు 3644 కొత్త కనెక్షన్స్ ఇప్పించామని, గృహ జ్యోతి పథకం ద్వారా 3652 కుటుంబాలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని, మీరు పది సంవత్సరాల నుండి చేయలేని కొత్త రేషన్ కార్డులు కేవలం మా మండలంలోనే 752 కొత్త రేషన్ కార్డులు ఇప్పించామని అన్నారు. మండలంలో నూతనంగా సాయనపల్లి, ముత్తాపురం, కాచనపల్లి గ్రామపంచాయితీల్లో సబ్ స్టేషన్ లు కూడా అమలు చేసి ప్రతీ గ్రామానికి వెలుగులు నింపుతున్న ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వమని, రైతులకు నీటి కొరత రాకుండా పడుగోనిగూడెం, పోతిరెడ్డిగూడెం, శెట్టుపల్లి, నడిమిగూడెం,
వెంకటాపురం గ్రామ పరిధిలో చెక్ డ్యాం ల నిర్మాణం చేసి వందల ఎకరాల భూములకు నీటి కొరత లేకుండా చేస్తున్నామని, ప్రతీ గ్రామంలో అనేక సీసీ రోడ్లు నిర్మించామని, మండల పరిధిలోని కస్తూరి బా, జెడ్పీహెచ్ఎస్, ప్రైమరీ స్కూళ్లకు నూతన బిల్డింగ్ లు, ప్రహరి గోడల నిర్మాణం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత మా ప్రజా ప్రభుత్వానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గుర్రం పుష్పరాజ్, మండల నాయకులు భూక్య శ్రీను, వాంకుడోత్ రమేష్, సనప రాంబాబు, గడ్డం రాజేష్, ఇస్లావత్ మోహన్, భూక్య నరేష్, బోడ శివ, బొంగు చంద్రశేఖర్, వీరసరపు భారత్ తదితరులు పాల్గొన్నారు.