యూనివర్సిటీ కోసం వినతి పత్రం
నిర్మల్ సెప్టెంబర్ 21 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాకు ప్రత్యేకంగా యూనివర్సిటీని(University) ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ కలెక్టర్ కార్యాలయంలో (Collector's Office)వినతిపత్రం అందించారు. జిల్లాలోని పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. నిర్మల్ జిల్లాలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే స్థానిక విద్యార్థులకు డిగ్రీ, పీజీతో పాటు ఇతర ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను స్థానికంగానే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత జనవరి 16న నిర్మల్‌లో జరిగిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్ ఐటిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు.