బీసీ-ఏ అమలు కోసం రౌండ్ టేబుల్ సమావేశం
17-09-2026 | 04:11pm
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): బీసీ–ఏ వర్గీకరణ అమలు కోసం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ–ఏ వర్గీకరణ(BC–A classification)ను వెంటనే అమలు చేయాలని, బీసీ సమాజాల హక్కుల(rights of BC communities) కోసం ఐక్య కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మత్స్యకారులకు 50 సంవత్సరాల నుంచే పింఛన్ అందించాలని, ముదిరాజ్ల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, సిరిసిల్లలో 5 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.