ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఐక్య కూటమినీ గెలిపించండి
ఐక్య కూటమి పిలుపు
కామారెడ్డి, అక్టోబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో ఈనెల 9 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ యూనియన్(RTC Union) గుర్తింపు ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి డిపో ఎదుట సుమారు 200 మంది కార్మికులతో శుక్రవారం గేట్ మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఐక్య కూటమి ప్రతినిధులు ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు.
జరుగ బోవు ఎన్నికల్లో ఐక్యకూటమి ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ లను లను గెలిపించి ఆర్టీసీ విలీనం, పనిగంటల విధానం, యాజమాన్యం వేధింపులు,శ్రమాదోపిడిని నిరోదించడం, కార్మిక హక్కులను కాపాడతమని కార్మికులకు పిలుపు నిచ్చారు. కార్మికులకు 40 డిమాండ్స్ లను హామీ ఇస్తూ కరపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్ర గుర్తింపు క్లాస్ -3 బ్యాలెట్ లో బస్సు గుర్తుకే ఓటు వేయాలని, రీజియన్ గుర్తింపు క్లాస్ -6 కు నిచ్చెన గుర్తుకే ఓటు వేయాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఐక్య కూటమి నాయకులు వెంకట్ గౌడ్, వి డి దాస్, మురళి, నర్సయ్య, రమేష్, రాజు, ఖాదీర్ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ఐక్యకూటమి జేఏసీ నాయకులు ఈదురు వెంకన్న మాట్లాడుతూ మొన్న జరిగిన ఆర్టీసీ సమ్మె పోరాటాన్ని ఈ కుటమే నడిపిoచిందని ప్రభుత్వం ను ఒప్పించి 11 %వేతన సవరణ, ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వం ఉద్యోగులుగా విలీనం సాధించిన ఘనత కూటమి ఘనతనే కారణమని అన్నారు, కార్మికులు హక్కుల లలో భాగంగా కెసిఆర్ రద్దుచేసిన గుర్తింపు ఎన్నికలను ఒప్పించిన ఘనత ఐక్య కుటమే నని పేర్కొన్నారు. అందుకే పోరాడే ఐక్యకూటమినే గెలిపించాలని వారు కోరారు.