ట్రాక్టర్ బోల్తా పడి పారిశుద్ధ్య ట్రాక్టర్ డ్రైవర్ మృతి

25-09-2026 | 08:58pm

రాజపూర్ : ట్రాక్టర్ బోల్తా(Tractor overturns) పడి గ్రామపంచాయతీ(Gram Panchayat) పారిశుద్ధ్య ట్రాక్టర్ డ్రైవర్ మృతి(Sanitation tractor driver dies) చెందిన సంఘటన కుతినేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం కుతినేపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పులి రఘు గురువారం  రాత్రి బోడ గుట్ట తండాలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో భాగంగా విస్తరాకులు తీయాలని గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను సర్పంచ్ ఆదేశాల మేరకు తీసుకువెళ్లాడు.

భోజనాల అనంతరం ఆకులను వ్యక్తపదార్థాలను ట్రాక్టర్లు వేసుకొని వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పులి రఘు కు తీవ్ర రక్త గాయాలయ్యాయి.సంఘటన స్థలంలోని మృతి చెందాడు.అటుగా వెళుతున్న రైతు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన పులి రఘును చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంపై శుక్రవారం మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు