డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్
25-09-2026 | 03:49pm
చేగుంట సెప్టెంబర్ 25, (విజయక్రాంతి) : పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను(Digital smart ration cards) అందజేస్తోందని చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్(Chegunta Sarpanch Sandrugu Sravanthi Satish) తెలిపారు. శుక్రవారం పట్టణ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను(Smart ration cards) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి(Congress Party) అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,ఉపసర్పంచ్ రఫీ , పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఏ ఎం సి డైరెక్టర్ స్టాలిన్ నర్సిములు, వార్డ్ సభ్యులుశ్రీ రమణ శ్రీనివాస్, నాగరాణి లింగం, ఆకుల సుకెందర్, వంశీ, హరీష్, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.