తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయానికి పాఠశాల భవనాలను గుర్తించాలి..

19-09-2026 | 08:57pm

జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ 

మెదక్, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి) : జిల్లాలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు అనువైన పాఠశాల భవనాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ (District Collector Pratimasingh)అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ (Collectorate) చాంబర్లో కేంద్రీయ విద్యాలయ డిప్యూటీ కమిషనర్, సంతోష్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఎ.ఎ. ఇజ్రాయల్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా వసతులను పెంచేందుకు క్రమంగా కొత్త విద్యాలయాలను మంజూరు చేస్తోంది అని ఇటీవల  తెలంగాణ రాష్ట్రంలో  కొన్ని జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసిందని , మెదక్ జిల్లాలో నూతన కేంద్రీయ విద్యాలయ నెలకొల్పేందుకు హవేలీ ఘనపూర్ మండలంలో  వై పి ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పరిసర ప్రాంతాలలో 06 ఎకరాల స్థలాన్ని గుర్తించడం జరిగిందన్నారు. అందులో భాగంగా మెదక్ జిల్లాలో కేంద్రీయ విద్యాలయాన్ని తాత్కాలికంగా ప్రారంభించేందుకు అనువైన విద్యాలయ భవన సముదాయాలను గుర్తించాలని, గుర్తించిన వెంటనే కేంద్రీయ విద్యాలయం తాత్కాలికంగా ప్రారంభించే విధంగా 

చర్యలు తీసుకుంటామని నూతన కేంద్రీయ విద్యాలయం  నిర్మాణం పూర్తయిన వెంటనే  తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని  నూతన భవనాల్లోకి తరలించే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామన్నారు.  అంతకుముందు మెదక్ పట్టణంలో  కేంద్రీయ విద్యాలయ నెలకొల్పడానికి భవనాలను  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, గణాంక అధికారి  నవీన్, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు