చైనా ఆసియా గేమ్స్‌కు ఎంపిక
25-09-2026 | 08:29pm
ఈశ్వరికి డీఈవో అభినందనలు
నంగునూరు, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): మండలంలోని గట్లమల్యాల జిల్లా పరిషత్ హైస్కూల్(Gattlamalyala Zilla Parishad High School) విద్యార్థిని బానోతు ఈశ్వరి(Banothu Eswari) అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు(International softball competitions) ఎంపికైంది.ఈనెల 12 నుంచి 18 వరకు చైనాలో జరిగే ఏసియన్ గేమ్స్‌లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.ఈ సందర్భంగా చైనా వెళ్లనున్న ఈశ్వరిని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ అభినందించారు.
గ్రామీణ ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పాఠశాలకు, జిల్లాకు పేరు తెస్తున్నందుకు ఆమెను ప్రశంసించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాదాసి రమేష్,వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్‌కుమార్,హెచ్‌డబ్ల్యూఓ మాధవిలత తదితర ఉపాధ్యాయ బృందం విద్యార్థినిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.