అనారోగ్యంతో మహిళ ఆత్మహత్య
కరీంనగర్ క్రైం , సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): కరీంనగర్లోని రాంనగర్ కు చెందిన ఓ మహిళ అనారోగ్య కారణాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు రాంనగర్ కు చెందిన కోడిముంజ శంకరయ్య పోలీస్ శాఖ లో(Kodimunja Shankaraiah Police Department) పనిచేసే రిటైర్ అయ్యారు. అతని భార్య లింగవ్వ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. వాటికి తోడు డయాబెటిస్, ఫైల్స్ కు చికిత్స తీసుకున్న లింగవ్వ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనస్థాపానికి గురైంది.
శుక్రవారం ఉదయం శంకరయ్య పాల కోసం బయటికి వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన శంకరయ్య వెంటనే పోలీసులకు సమాచారం అందించి కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయిందని ధ్రువీకరించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిందని శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ టు టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి తెలిపారు.