ఆలయ ప్రాంగణంలో వేలంపాట సందడి
25-09-2026 | 09:49pm
గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక ఆలయ
పటాన్ చెరు, సెప్టెంబర్ 25 : గణేష్ గడ్డ శ్రీ సిద్ధి గణపతి(Ganesh Gadda Sri Siddhi Vinayaka Temple) లడ్డూల వేలంపాటలో భక్తి వెల్లువెత్తింది. 11 రోజులపాటు పూజలందుకున్న మూడు లడ్డూలకు కలిపి రూ.11.40 లక్షలు ధర పలికింది. దీంతో ఆలయ ప్రాంగణం వేలంపాట సందడితో మార్మోగింది. తొలి లడ్డూ రూ.4.30 లక్షలకు అత్యధిక ధర పలకగా ఆర్సీపురానికి చెందిన ప్రత్యూష వరుణ్ దక్కించుకున్నారు.
రెండో లడ్డూ రూ.3.40 లక్షలకు అత్తాపూర్‌కు(Attapur) చెందిన సంపత్‌రెడ్డికి(Sampath Reddy), మూడో లడ్డూ రూ.3.70 లక్షలకు పటాన్చెరుకు చెందిన మిద్దెల సాయి చరణ్‌గౌడ్‌కు దక్కాయి. లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకునేందుకు భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొనడంతో కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.