సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

17-09-2026 | 10:21pm

నేరేడుచర్ల,(విజయక్రాంతి): తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్(Telangana All Senior Citizens Association) నేరేడుచర్ల మండల(Nereducherla Mandal) సమావేశాన్ని గురువారం జిల్లా అధ్యక్షుడు గుడు గుంట్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించి మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాచకొండ శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా గజ్జల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా గజవెల్లి వెంకటేశ్వర్లు, తడకమళ్ళ పరమేశం, ప్రధాన కార్యదర్శిగా భువనగిరి అంజయ్య, సహాయ కార్యదర్శిగా నీలా రామ్మూర్తి, కోశాధికారిగా గుండా సత్యనారాయణ లను  ఎన్నుకున్నారు, ఎన్నిక అనంతరం ప్రమాణస్వీకారం చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మద్ది ఉపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి బుచ్చయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి రామయ్య, గుండా బిక్షపతి, సీనియర్ సిటిజన్లు గోళ్ళ సుధాకర్, రాచకొండ శ్రీనివాసరావు, కందిబండ శ్రీనివాసరావు, గుంటూరు శీను, ఉప్పల పుల్లయ్య, ఊటుకూరు నటరాజ్, చెరుకు రాము తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు