సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం

30-09-2026 | 03:59pm

కొత్తపల్లి, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్  సూచన మేరకు, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం  చేయడం జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, రాష్ట్ర కార్యదర్శి ఓబిసి మోర్చా రాజు అడిచెర్ల పాల్గొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో వీరబ్రహ్మేంద్రస్వామి అనాధ వృద్ధ  ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్, పుప్పల రఘు, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచకొండ కొమురయ్య, గర్దాస్ సతీష్, కడర్ల రతన్ కుమార్, రమేష్, రవి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు