అట్టహాసంగా ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభం
రాజాపూర్ సెప్టెంబర్ 17: క్రీడలతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రెటరీ వేణుగోపాల్(SGF District Secretary Venugopal), మండల విద్యాధికారి సుధాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో 70వ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ మండల స్థాయి క్రీడ పోటీలు అట్టహాసంగా ప్రారంభం చేశారు. ఈ క్రీడా పోటీలలో జడ్పీహెచ్ఎస్ రాజాపూర్, జెడ్పిహెచ్ఎస్ తిరుమలాపూర్, ఎంపీహెచ్ఎస్ రంగారెడ్డి గుడా , కేజీబీవీ రాజాపూర్, అలాగే ప్రైవేటు పాఠశాలలు అగస్త్య, ప్రతిభ విద్యానికేతన్, కేశవరెడ్డి పాఠశాలలకు చెందిన మొత్తం 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
అండర్ 14, అండర్ 17 ఆటలలో బాల బాలికలకు కోకో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత సమాజంలో దేహదారుడ్యము, మానసిక వికాసం కోసము, దేశ రక్షణ, పోలీసు శాఖలో ఉద్యోగం పొందాలంటే శరీరకంగా దృఢంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులకు పోటీ పరీక్షలలో ఐదు శాతం రిజర్వేషన్ ఉంటుందని తెలియజేశారు.