రామప్పకు సింగరేణితో ముప్పు అవాస్తవం

06-10-2026 | 05:20am

సమగ్ర శాస్త్రీయ అధ్యయనం తర్వాతే మైనింగ్‌పై ముందుకు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి) : ప్రపంచ వారసత్వ సంపద(World Heritage Site) అయిన రామప్ప గుడికి(Ramappa Temple) సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలు కేవలం అపోహలు, అవాస్తవాలు మాత్రమే అని సింగరేణి యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సింగరేణి ఆధ్వర్యంలో ములుగు జిల్లా(Mulugu District) వెంకటాపూర్‌లో చేపట్టాలని తలపెట్టిన వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు(Venkatapur Open Cast Project) విషయం లో సమగ్రంగా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని యాజమాన్యం స్పష్టం చేసింది.

ఈ విషయంలో భారత పురావస్తు శాఖ, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థలు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి తెలంగాణకు చెందిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప గుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేకూర్చబోదని, వారసత్వ సంపద పరిరక్షణకు కట్టుబ డి ఉంటుందని స్పష్టం చేసింది. పర్యావరణ హితమైన చట్టబద్ధమైన మైనింగ్ కార్యకలాపాలు మాత్రమే సింగరేణి అధిక ప్రాధాన్యాలు అని పునరుద్ఘాటించింది.  

మరిన్ని వార్తలు