ఆరుగురు దొంగలు అరెస్ట్
- రూ.50,000 నగదు,
- రెండు ద్విచక్ర వాహనాలు లభ్యం
- 10 కిలోల కాపర్ వైర్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం
- ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడి
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తాండూర్ సీఐ కార్యాలయంలో అరెస్టు వివరాలను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్(ACP Kiran Kumar) వెల్లడించారు.
తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని నిందితులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. బండి నీలేష్, బోయపల్లి బోర్డు( రెబ్బెన మండలం), దూల రాజేశాం (తాండూర్), మీసాల బిక్షపతి, దూల నవీన్, (తాండూర్), ఈగం రాజేష్, బట్వ్యాన్పల్లి గ్రామం, (బెల్లంపల్లి మండలం), రెబ్బెన శ్రీకాంత్, నార్లపూర్, (రెబ్బెన మండల)లను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
నిందితుల నుంచి రూ.50,000 నగదు,TS 19 J 3474 Hero HF Deluxe ద్విచక్ర వాహనం AP 25 Q 0753 – Hero Splendor ద్విచక్ర వాహనాలు, 05 సెల్‌ఫోన్లు,10 కిలోల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తాండూర్ సీఐ, భీమిని ఎస్‌ఐ, తాండూర్ ఎస్‌ఐ పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచారు. సమావేశంలో తాండూర్ సీఐ దేవయ్య, ఎస్ఐ లు పాల్గొన్నారు.