స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సులభంగా సేవలు
చేగుంట,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) అందించడమే లక్ష్యమని బోనాల గ్రామ కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షులు పుల్లూరి రమేష్, ఉపాధ్యక్షులు కర్నె సంతోష్ పరిగి అన్నారు. మండల పరిధిలోని బోనాల గ్రామంలో బుధవారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోర్రు సంతోష్, ఎస్సి సెల్ అధ్యక్షులు చాతిని నర్సిములు, రామ చంద్రం, ఎల్లమైన స్వామి, మురారి అంజయ్య, కాజీపూరం ఎల్లయ్య, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.