స్మార్ట్ రేషన్ కార్డుల.. సులభ సేవలు

30-09-2026 | 11:55am

మహమ్మదాబాద్,సెప్టెంబర్ 30(విజయక్రాంతి): అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే(MLA), డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy) అన్నారు. మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో బుధవారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల(Smart ration cards) పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు రాంలాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కేఎం నారాయణ, శాంతిరంగ్యా, ఎంఏఓ నరేందర్,లక్ష్మీకాంత్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు