డంపింగ్ యార్డ్ నుండి వెలువడే పొగలు... దుర్వాసనలు వెంటనే నివారించండి
డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి, ఉమా మహేష్.
జవహర్ నగర్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): డంపింగ్ యార్డ్ నుండి వెలబడే పొగలు దుర్వాసనలను వెంటనే నివారించడని డంపింగ్ యార్డ్ (Dumping yard) ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమా మహేష్ లు డిమాండ్ చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (Malkajigiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో గత రెండు రోజులుగా జవహర్ నగర్ పరిధిలోని కార్మిక నగర్ వాసులు పట్టపగలే చీకట్లను తలపించే పొగలతో పాటు మురికి నీటి మురుగును పెద్ద ఎత్తున బుడగలుగా మారి గాలిలో తేలుతూ ఇండ్లలోకి చేరి పగిలిపోవడంతో భరించలేని దుర్వాసనలతో విలవిలలాడుతున్నారని డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమామహేష్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భరించలేని దుర్ఘందాలతో కూడిన పొగలు మురికినీటి నురగల వలన కండ్లు కూడా దెబ్బతిని కంటి చూపులు మందగించే పరిస్థితి నెలకొందన్నారు. గతంలో కూడా పొమ్మనలేక దుర్వాసనలు వెదజల్లే బురదతో కూడిన మురికి నీటి పైపులైను అర్ధరాత్రి పూట ధ్వంసం చేసి కార్మిక నగర్ వాసులపై వదిలారని గుర్తు చేశారు.
ఇలాంటి అప్రజాస్వామీక చర్యలను రాంకీ యాజమాన్యం చేపట్టే కక్షపూరితమైన చట్ట వ్యతిరేకమైన చర్యలను తీవ్రంగా ఖండించాలన్నారు. ఇప్పటికైనా రాంకీ పద్ధతులు మార్చుకొని కార్మిక నగర్ వాసు లైన పిల్లలు వృద్దులు శ్వాస కోస వ్యాధులకు గురికాకుండా తగిన ఆరోగ్య భద్రతలో భాగంగా మంచినీటి సౌకర్యాలు కల్పించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని లేనియెడల పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేస్తామని హెచ్చరించారు .