జిల్లా స్థాయికి ఎంపికైన శ్రీ నారాయణ పాఠశాల విద్యార్థులు

18-09-2026 | 09:55pm

గణపురం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న 69వ పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో గణపురం శ్రీ నారాయణ హైస్కూల్(Sri Narayana High School) విద్యార్థులు సత్తా చాటారు. శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి ఖో-ఖో, కబడ్డీ పోటీల్లో 14 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.

పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికల ఖో-ఖో, కబడ్డీతో పాటు పదిహేడు సంవత్సరాలలోపు ఖో-ఖో, కబడ్డీ విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల చైర్మన్ నాగనబోయిన రవి, కరస్పాండెంట్ పోతుగంటి శశిధర చారి అభినందించి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. విద్యార్థుల ప్రతిభకు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు కార్తీక్, రాజేందర్‌ను  అభినందించారు.

మరిన్ని వార్తలు