ఆర్థిక అక్షరాస్యత అందరికీ అవసరం

17-09-2026 | 10:17pm

భైంసా,(విజయక్రాంతి): విద్యార్థి దశ నుంచే అందరూ ఆర్థిక అక్షరాస్యత(Financial literacy), సైబర్ నేరాలపై అవగాహన ఉండాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్(District Lead Bank Manager Ram Gopal) అన్నారు. గురువారం బైంసా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు(Cybercrimes), ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

ప్రతి ఒకరు ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండి, పొదుపును పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి ఒకరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు