మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ
02-10-2026 | 07:13pm
నిర్మల్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతహి సేవ -2026 కార్యక్రమం(Swachhata Hi Seva Program) నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు మంజులాపూర్ చెరువు వద్ద ఉన్న చెత్తను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేలు చేసి చెత్త బండికి ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డ్ కౌన్సిలర్ నరేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మెప్మా టిఎంసి సావిత్రి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.