స్వేరో నెట్వర్క్ సూర్యపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా పిడమర్తి దశరథ, ప్రధాన కార్యదర్శిగా కొండగడుపుల ఎల్లయ్య నియామకం పట్ల హర్షం
తుంగతుర్తి, (విజయ క్రాంతి): స్వేరోస్ నెట్వర్క్(Sweros Network) సూర్యాపేట జిల్లా నూతన కమిటీని జిల్లా ఇన్చార్జ్ ఏర్పుల ప్రసాద్ కృష్ణ ఆధ్వర్యంలో నియమించారు. ఈ సమావేశానికి స్వేరోస్ సీనియర్ నాయకులు మచ్చ నరసయ్య, బొల్లికొండ వీరస్వామి లలితా హాజరై నూతన కమిటీ సభ్యుల కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ కృష్ణ మాట్లాడుతూ.... జ్ఞాన సమాజ నిర్మాణమే స్వేరోస్ నెట్వర్క్ ప్రధాన ధ్యేయమని, అక్షరం-ఆరోగ్యం-ఆర్థి ఆత్మగౌరవం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
చేసే ప్రతి పనిని నిర్లక్ష్యం చేయకుండా ఇష్టంతో, బాధ్యతతో నిర్వహిస్తే జీవితంలో ఆర్థికంగా ఎదగవచ్చ ని తెలిపారు. డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బాటలో పయనిస్తూ జ్ఞాన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డా. బి.ఆర్. అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, కాన్షీరాం ఆశయాల ను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సూచించారు.
జిల్లా అధ్యక్షుడిగా పిడమర్తి దశరథ,ప్రధాన కార్యదర్శిగా కొండగడుపుల ఎల్లయ్య,ఉపాధ్యక్షులుగా బత్తినీ సరిత, కొత్త పుల్లయ్య, అధికార ప్రతినిధి గా నకిరేకంటి వెంకన్న,కోశాధికారిగా పెరుమాళ్ళ సరిత, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా రామస్వామి,సైదులు,ఎన్నుకోగా ప్రేరణ ఇన్చార్జిగా పెద్దపంగు ఉపేందర్ స్వేరో ను ఎన్నుకోవడం తోపాటు ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ గా నాగమణి, సంపత్, సతీష్, రేణుక తో పాటు పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ...అక్షరం- ఆరోగ్యం- ఆర్థికం- ఆత్మగౌరవం అనే లక్ష్యాలతో జ్ఞాన సమాజ నిర్మాణానికి నూతన కమిటీ కృషి చేయాలని అన్నారు. స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్ఫూర్తితో మహాత్మా పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, కాన్సిరాం ల ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ సీనియర్ నాయకులు లలితా రాణి, మాతంగి రాములు, కొండ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.