గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో తహసీల్దార్ ఆంజనేయులు పూజలు
24-09-2026 | 02:35pm
ఆలేరు, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తహసీల్దార్ ఆంజనేయులు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ పాశికంటి సంపత్, కందగట్ల నరేందర్, కందగట్ల శ్రీనివాస్, శ్యామల, కిష్టయ్య, కందగట్ల సనత్ కుమార్, మలిపెద్ది భాస్కర్, దూడల విశాల్, ఎలుగల శివసాయి, బేతి యశ్వంత్, గంధం జస్వంత్, కుడికాల సంజయ్, పెండెం ప్రణీత్, ఫిరోజ్, కందగట్ల లావణ్య, మలిపెద్ది భవాని తదితరులు పాల్గొన్నారు.