ఎస్ జి ఎఫ్ క్రీడల్లో ఎంజీఎం పాఠశాల విద్యార్థుల ప్రతిభ

18-09-2026 | 10:10pm

జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు

గణపురం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య పోటీల్లో ఎంజీఎం పాఠశాల(MGM School) విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పద్నాలుగు సంవత్సరాలలోపు బాలుర కబడ్డీలో ఎండీ. బాబూర్ రేయాన్, ఎం. అన్వేశ్ వర్మ, ఎం. రక్షిత్ కుమార్, కె. కౌశిక్ ఎంపికయ్యారు.

వాలీబాల్‌లో ఎండీ. రెహాన్ బాబా, జి. నవలేష్, ఎం. రక్షిత్ కుమార్, ఎం. శివసాయి ఎంపికయ్యారు. పదిహేడు సంవత్సరాలలోపు బాలుర ఖో-ఖోలో ఈ. ప్రణయ్, వాలీబాల్‌లో ఎం. యశ్వంత్, ఎస్. రోషన్ జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఎంజీఎం పాఠశాల యాజమాన్యం, పాఠశాల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు