5 September, 2026 | 8:37 PM

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పాత్రికేయులకు సన్మానం

05-09-2026 | 06:41pm

ఎర్రుపాలెం సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): ఎర్రుపాలెం మండల వాసవి క్లబ్(Vasavi Club) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను(Teachers), పాత్రికేయలను( journalists) ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో రెండు దశాబ్దాలుగా పైగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థులకు పలు  విద్యా నైపుణ్యాలను అందిస్తూ  విద్యార్థులకు ఇంగ్లీష్ బోధిస్తున్న తుంగతుర్తి వెంకటేశ్వర్లను ఘనంగా శాలువాతో సన్మానించారు.

మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయులు ఈనాడు రామకృష్ణ కు వాసవి క్లబ్ ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. మండల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ఘనంగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతుంది. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గేమ్స్ దుస్తులను అందించారు. విద్యార్థిని విద్యార్థులకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు దోపకుంట పుల్లారావు, కొప్పు పరమేశ్వరరావు, దొడ్డ అశోక్, దొడ్డ సంధ్య వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు