5 September, 2026 | 10:53 PM

సరస్వతీ శిశు మందిర్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

05-09-2026 | 08:34pm

ముకరంపుర(విజయక్రాంతి) సరస్వతీ శిశు మందిర్‌(Saraswati Shishu Mandir)లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు(Teachers Day celebrations) శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి డా.సర్వేపల్లిరాధాకృష్ణన్(Dr. Sarvepalli Radhakrishnan) జయంతి సందర్భంగా పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు(Cultural programs), ప్రసంగాలు తదితర కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయులను సత్కరించారు. పాఠశాల ప్రధానాచార్య మోర రణధీర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ తమ జీవితాలకు దిశానిర్దేశం చేస్తున్న గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేసి, సర్టిఫికెట్ లు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు