5 September, 2026 | 10:52 PM

తేజ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

05-09-2026 | 09:23pm

కోదాడ,(విజయక్రాంతి): పట్టణంలోని తేజ ఫార్మసీ కళాశాల(Teja Pharmacy College)లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day) ఘనంగా నిర్వహించారు.  ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి, ఆచార్యులు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి(Dr. Sarvepalli Radhakrishnan Birthday) సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారని, ఉపాధ్యాయ లోకం ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఫార్మసీ కళాశాల అధ్యాపకురాళ్ళు వీర కుమారి, నిఖత్, అంజుమ్, అమ్రిన్, ఉమా లను శాలువాతో సన్మానించారు.  సి ఈ వో ఎస్ ఎస్ రావు స్వీట్స్ అందజేసి, అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకురాళ్లు సల్మా, సాహితీ, అరుణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు