తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే..

13-09-2026 | 05:05am

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులు గుండా మల్లయ్య గుప్తా

ఎల్బీనగర్, సెప్టెంబర్ 12 : సమాజంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం  గురువులదేననీ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులు గుండా మల్లయ్య గుప్తా(Yadagirigutta Trust Board member Gunda Mallayya Gupta) పే ర్కొన్నారు. శనివారం కొత్తపేట వాసవి కా లనీ లోని హోటల్ శ్రీవేద ఫంక్షన్ హాల్ లో వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ డా కాచం సత్యనారాయణ గుప్తా(Kacham Satyanarayana Gupta) ఆధ్వర్యంలో గురుపూజోత్సము   కార్యక్రమానికి ముఖ్య అతి ధులుగా ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మల్లయ్య గుప్తా మాట్లాడుతూ సమా జంలో  ఉపాధ్యాయ వృత్తి(Teaching Profession) ఎంతో పవిత్రమైనదని, దేశ నిర్మాణం తరగతి గదిలోనే తీర్చి దిద్దుకుంటుందని అన్నారు. ఏ వృత్తిలో ఉ న్న అంత సంతృప్తి ఇవ్వదని, ఒక్క ఉపాధ్యా య వృత్తిలోనే సంతృప్తి ఉంటుందని అన్నా రు. అనంతరం ఫౌండర్ చైర్మన్ కాచం  సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ వైశ్య వికాస వేదిక నుండి ప్రతి సంవత్సరము గురుపూజోత్సవాన్ని  నిర్వహించి రాష్ట్రంలోని   వైశ్య ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తామని తెలిపారు.

గత 8 సంవత్సరాలుగా దాదాపు 3,000 మంది ఉపాధ్యాయులను సన్మానించి వారిని గౌరవించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణవ గ్రూప్ సీఎండీ బూరుగు రవి గుప్తా, సంఘ సేవకులు గౌరీశెట్టి శ్రీనివాస్, ఎంవీఎస్ ఆర్ కాలేజ్ వ్యవస్థాపక డైరెక్టర్ వెంకటేశం గుప్తా, నీల శ్రీధర్, వైశ్య వికాస వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరు రమేశ్, కొత్త రవి, కాచం నర్సింహులు, కాచం సాయి, కూర రమేశ్ , రామ్ నరేష్,  కొడుమూరి దయాకర్, కాచం సుష్మ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు